చేవెళ్ల త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టిన రోజు వేడుకలపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ అంశంలో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, పర్మిషన్ లేకుండా మద్యం వాడకంపై కేసులు నమోదయ్యాయి.. మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసు పెట్టారు.
Also Read : Balakrishna : రీల్ తగలబెట్టేస్తా.. దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. !
ఇక ఈ క్రమంలో దామోదర్ రెడ్డికి గంజాయి టెస్టులో పాజిటివ్ రాగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పార్టీలో మొత్తం 48 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. బిగ్ బాస్ ఫేమ్ దివితో పాటు లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. శివారు ప్రాంతాల్లో క్లబ్బులుగా మారిన రిసార్టులలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారు.
Also Read : Jr NTR : బన్నీ మిస్సైన కథతో జూనియర్ ఎన్టీఆర్.. నాగవంశీ హింట్స్!
మంగ్లీ పుట్టిన రోజు వేడుకల గంజాయి సేవించినట్లు దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ రాగా, ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్ మేఘవత్ దునే స్నేహితుడు అని అంటున్నారు. అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులు చెక్ చేయడానికి వస్తే మంగ్లీ ఓవర్ యాక్షన్ చేసినట్టు పోలీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. పోలీసులను లోపలికి రానివ్వకుండా ఉండేందుకు ఆమె యత్నించినట్లు ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.