సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రన్ గురించి సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, విజయ్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె వర్క్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేస్తున్న సిమ్రన్ ఇటీవల విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో సిమ్రన్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ప్రజంట్ వరుస ప్రాజుక్ట్‌లు లైన్ లో పెట్టిందట. ఇకపోతే తాజాగా ఓ నటికి చిన్నపాటి కౌంటర్ ఇచ్చింది సిమ్రాన్..
Also Read: Tarun Bhaskar : తన తండ్రి కల నెరవేర్చిన టాలీవుడ్ డైరెక్టర్ ..
ఏంటా పోస్ట్ అంటే.. ‘కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి ఓ సందేశం పంపించాను. ఆమె నటించిన ఒక సినిమానిలో ఆమె పాత్ర చాలా బాగుంది.. ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్ పంపా. దానికి ఆమె వెంటనే స్పందించింది. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్ చేసిన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే వర్క్ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతాం. దేనిని చులకనగా చూడకూడదు’ అని ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చింది సిమ్రాన్.