టాలీవుడ్ లో బంద్ఇంకా కొనసాగుతోంది. తమకు రోజు వారి వేతనాల 30% పెంచాలని కార్మిక సంఘాలు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ కు బంద్ ప్రకటించారు. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన సినిమాలు కూడా వాయిదా వేసాయి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు కూడా షూటింగ్స్ ఆగిపోయాయి.
Also Read : Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన చిన్న సినిమా..
అయితే ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మాంటేజ్ సాంగ్ ఒకటి కొంత ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఒక వారంలో రోజుల్లో షూట్ ఫినిష్ కావాలి. కానీ కార్మిక సంఘాలు షూటింగ్స్ కు బంద్ ప్రకటించారు. ఇతర భాషల నుండి వర్కర్స్ నుండి తీసుకువస్తే ఊరుకునేది లేదని ప్రకటించాయి. మరోవైపు మాస్ జాతర సినిమాను ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నామని డేట్ కూడా వేసేసారు. ఇటు చూస్తే కార్మికులకు ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య చర్చలు కొలిక్కివచ్చేలా లేదు. దాంతో బంద్ ఇలాగే కొనసాగితే ఏంటి పరిస్థితి అనే టెన్షన్ పడుతోంది యూనిట్. అయితే నేడు లేదా రేపటిలోగా బంద్ కు పరిస్కారం లభిస్తుందని ఛాంబర్ లో వినిపిస్తోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.