బాజీగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి శిల్పా శెట్టి. తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన వయస్సు 47ఏండ్లు అయిన స్వీట్ 16గా కనిపిస్తూ.. సాగరకన్యలా అందరిమదిలో నిలిచింది ఆమె. జూన్ 8న తన బర్త్‌డే వేడుకలు తన నివాసం వద్ద ఓరేంజ్ లో జరుపుకుంది శిల్పా. ఈ సందర్భంగా తనకు తానే ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇచ్చుకుంది.
లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ను తన సొంతం చేసుకుంది. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ వ్యాన్‌లో సకల సదుపాయాలు ఉండేలా చూసుకుంది. కిచెన్, హెయిర్ వాష్ రూమ్, యోగా డెక్ సహా అన్నింటినీ అమర్చుకుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే శిల్పా ప్రయాణం చేసేటప్పుడు సమయం వృథా చేయకుండా యోగా చేసేందుకే యోగా డెక్‌ను అరేంజ్ చేసుకుందట. ఇక ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ గదికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వ్యానిటీ వ్యాన్ ఉంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన నికమ్మ చిత్రం జూన్ 17న రిలీజవుతోంది. అలాగే రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌తో త్వరలో ఓటీటీలోనూ అడుగు పెట్టనుంది. ఇప్పటివరకు అజయ్ దేవ్‌గణ్ (సింగం), రణ్‌వీర్ సింగ్ (సింబా), అక్షయ్ కుమార్ (సూర్యవంశి)లను పోలీస్ ఆఫీసర్స్‌గా చూపించిన రోహిత్ శెట్టి ఈసారి శిల్పాశెట్టిని పోలీస్‌గా వెండితెరపై ప్రజెంట్ చేయనున్నాడు.