శర్వానంద్ తన 36వ చిత్రంతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ‘జా-డ్రాపింగ్’ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్ స్టిల్స్‌లో శర్వా కొత్త లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. షర్ట్‌లెస్ లుక్స్‌లో, ఎంతో షార్ప్‌గా ఉన్న అబ్స్‌తో, రేసర్‌కు ఉండాల్సిన తీక్షణమైన చూపు(ఫైరీ గేజ్)తో అద్భుతమైన స్పిరిట్‌ను ప్రదర్శించారు.
Also Read:Pradeep Ranganathan: 100 కోట్ల క్రెడిట్ తెలుగు ఆడియెన్స్‌కి ఇచ్చిన ‘డ్యూడ్’..
నెలల తరబడి కఠినమైన వర్కౌట్స్, ఖచ్చితమైన డైట్ మరియు పూర్తి డెడికేషన్‌తో శర్వా ఈ లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని సొంతం సాధించారు. ఇంత ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా శర్వా కనిపించడం ఆసక్తికరం. ‘బైకర్’ చిత్రంలో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఎ. పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.