ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నటినటులు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ, అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటీటీ, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది కాస్త బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. దీంతో ఈ విషయంపై తాజాగా షారుఖ్ ఖాన్ ఒక సూపర్ ఐడియా ఇచ్చారు..
Also Read: Hit3 : 24 గంటల్లో బీభత్సం.. నాని కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్
తాజాగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025 లో అతిథిగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ..‘ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలి, వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలి, టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి’ అని తెలిపారు. షారుఖ్ అన్న దాంట్లో లాజిక్ ఉంది. సగటున 200 నుంచి 500 రూపాయల మధ్యలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు ఉంటున్నాయి. పాన్ ఇండియా చిత్రాలకు టికెట్ ధర పెంచితే ఓకే కానీ మార్కెట్ తక్కువగా ఉండే కొందరు హీరోలకు సైతం ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు నిర్మాతలు. ఒకవేళ షారుక్ ఐడియా ప్రకారం, వంద లోపు టికెట్లు అమ్మేలా సాధారణ వసతులు ఉన్న సింగిల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే, హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఎక్కువ జనాలు థియేటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐడియా అయితే చెప్పాడు కానీ మోనోపోలీ రాజ్యమేలే ఇండస్ట్రీలో ఇదంతా ఈజీ కాదు. ఎందుకంటే పెట్టుబడి మొత్తం వారం పది రోజుల్లో వచ్చేయాలని కంకణం కట్టుకుంటున్న నిర్మాతలు ఈ చీప్ థియేటర్స్ కాన్సెప్ట్‌కి అంత సులభంగా ఒప్పుకోరు.