సెప్టెంబరు నెల స్టార్ట్ అయి సగం రోజులు గడుస్తుంది కానీ చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమాలు ఏమి లేవు. ఈ నెలలో వచ్చిన ఒకే ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా GOAT. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న గ్రాండ్ రిలీజ్ అయింది. తమిళ్ సంగతి పక్కన పెడితే తెలుగులో ఈ సినిమా సూపర్ ఫ్లాప్ గా నిలిచింది.ఇది తప్ప పెద్ద హీరోల సినిమాలు ఏవి రాలేదు. స్టార్ హీరోల సినిమాల సందడి ఈ నెలచివరి వారంలో మొదలు కానుంది.
Also Read : Dhanush : ఈ సారి ధనుష్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరంటే..?
ఎన్టీయార్ నటించిన దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అక్టోబరు 10న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయాన్ విడుదల కాబోతుంది. బ్లైండ్ పోలీస్ గా రజనీ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని సినీవర్గాల టాక్. అదే నెలలో వస్తున్నా మరొక సినిమా అమరన్. శివకార్తికేయన్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నవంబరు లో సూర్య నటించిన కంగువ రిలీజ్ కి రెడీగా ఉంది.డేట్ ఫిక్స్ చేయనప్పటికీ నవంబర్ రిలీజ్ పక్కా. ఆ వెంటెనే డిసెంబరు 6న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. డిసెంబరు 20న రాబోతున్న మరో సినిమా రామ్ చరణ్ శంకర్ ల గేమ్ ఛేంజర్. ఇవే కాకుండా నితిన్ రాబిన్ హుడ్, చైతన్య తండేల్, విశ్వక్ మెకానిక్ రాకీ వంటి సినిమాలు కూడా రానున్నాయి. సినీప్రియులకు ఇక రానున్నమూడు నెలలు పండగే