తమిళ స్టార్ ధనుష్ ఒక వైపు నటిస్తూనే దర్శకుడిగా ఓ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా 2017లో వచ్చిన పా పాండి. కమర్షియల్ గా పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా క్రిటిక్స్ నుండి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న ధనుష్ దాదాపు 7 ఏళ్ల తర్వాత రాయన్ సినిమాకు డైరెక్ట్ చేసాడు. సందీప్ కిషన్, కాళిదాసు జయరాం, సెల్వ రాఘవన్, SJ సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలివడమే కాకుండా ఈ ఏడాది కోలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన రెండవ సినేమాగా రాయన్ నిలిచింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ ఉత్సహంతో మరో సినిమాకు తెరకెక్కించిన మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) థియేటర్ రిలీజ్ కు రెడీగా ఉంది.
Also Read : kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..
కోలీవుడ్‌లో సిర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ మరో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దఫా ధనుష్ చేయబోయే సినిమాలో హీరోగా తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు, యంగ్ హీరో అరుణ్ విజయ్ ను హీరోగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.మరోవైపు అరుణ్ విజయ్ బాల దర్శకత్వంలో వనంగాన్‌లో నటిస్తున్నాడు. ఇది పూర్తీ అయిన వెంటనే ధనుష్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు అరుణ విజయ. ధనుష్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం లేకపోలేదు.