Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ ప్రస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో మరోసారి విషాదం నెలకొంది.. సూపర్ స్టార్ కృష్ణ ఘటన నుంచి ఇంకా తేరుకకముందే.. మరో సినీ దిగ్గజం భువినుండి దివికి ఎగిసింది.. సీనియర్ నటుడు.. కైకాల సత్యనారాయణ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. సినీ నటుడిగానే కాదు.. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన సేవలు అందించారు.. తన 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు.. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు పోషించారు.. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు..
1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కైకాలకు సంబంధించిన ప్రస్థానంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ.. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైన ఆయన.. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక.. నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు.. 777 చిత్రాల్లో నటించి మెప్పించారు.. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా.. ఆయన నటించిన చివరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు.. 200 మందికిపైగా దర్శకులతో పనిచేశారు. 100 రోజులు ఆడిన కైకాల నటించిన చిత్రాలు 223 ఉన్నాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59.. సంవత్సరం ఆడిన చిత్రాలు 10 ఉన్నాయి..
Also Read
ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో ప్రవేశం చేశారు కైకాల.. నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన ఆయనకు నటుడిగా గుర్తించారు డి.ఎల్.నారాయణ.. తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల.. సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయం అయ్యారు.. కైకాలకు ఎన్టీఆర్ పోలికలు కలిసివచ్చాయి.. కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించారు పరిశ్రమ పెద్దలు.. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి తెరను పంచుకున్నారు.. విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల.. కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అయితే, ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపుతిరిగింది.. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించారు.. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించి మెప్పించారు కైకాల.
యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు కైకాల .. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రల్లో ఆయన జీవించారు.. సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించి మెప్పించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల.. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు లాంటి చిత్రాలను నిర్మించారు.. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయనను సత్కరించారు.. ఇక, 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.. తొలి రోజుల్లో ”రాముడు-భీముడు’ వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.. కైకాల మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయనకు నివాళులర్పిస్తున్నారు.. కైకాలతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!