యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 276 కోట్లకు పైగా వసూలు చేసిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ సినిమాగా నిలిచింది.
Also Read : Gopi Chand : గోపీచంద్ కు బాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ దక్కుతుందా..?
అటు ఓవర్సీస్ లోను ఈ చిత్రం దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 2.7 మిలయన్ కు పైగా వసూలు చేసింది మరియు వెంకటేష్, అనిల్ రావిపూడి మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల హ్యాట్రిక్ కాంబో లో USAలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వినోదాత్మక కథాంశంతో, అనిల్ రావిపూడి యొక్క ట్రేడ్‌మార్క్ వినోదభరితమైన కథనం మరియు వెంకటేష్ యొక్క ఆకర్షణీయమైన నటనతో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. మరోవైపు చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రలో భాగంగా ఏపీలోని థియేటర్స్ ను విజిట్ చేస్తున్నారు. తాజాగా గడచిన ఆదివారం భీమవరంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో వెంకటేష్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.