Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Release: టాలీవుడ్లో వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ – యువ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘స్వాగ్’, ‘రాజరాజ చోర’ సినిమాల డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానుందని, ఒకసారి సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత దాదాపు 150 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరణ జరపాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి వీరాధివీరులు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌ను అనుకున్న టైంలో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్‌ను కూడా అందుకు అనుగుణంగా రూపొందించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా ఇప్పుడు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సంక్రాంతి సీజన్లో ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ క్రమంలో అనిల్ రావిపూడితో తమకు ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు దిల్ రాజు – శిరీష్‌లు ముందుగానే ఆయనకు తమ సినిమా విడుదల ప్రణాళిక గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో సినిమా రిలీజ్ టైంలో ఎలాంటి అపోహలు, వారి మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమా, షూటింగ్ షెడ్యూల్, సంక్రాంతి విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
- Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
- Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
తాజావార్తలు
-
Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..