వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసుల వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని విధంగా ఒక రీజినల్ బ్లాక్ బస్టర్ సినిమా 303 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి సరికొత్త ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసింది.
Sankranthi 2026: ఇప్పటి నుంచే కర్చీఫులు వేస్తున్నారయ్యో!!
అయితే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా అనేక రికార్డులు బద్దలు కొడుతోంది. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వీక్షించేందుకు సబ్స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక్క 24 గంటల వ్యవధిలోనే 35,000 మంది సబ్స్క్రైబర్లు జి5కి వచ్చారంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎంత కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇస్తే సినిమాని ఏ స్థాయిలో నిలబెడతారు అనేది మరోసారి నిరూపితమైంది అని చెప్పొచ్చు.