మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు సంగీత్ శోభన్. ఇక ఈ యూత్‌ఫుల్ క్రేజీ హీరో కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత,జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రం జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Shubham : ‘శుభం’ మూవీ OTT రిలీజ్ డేట్‌ఫిక్స్..
ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతొ ఇప్పటికే విడుదలైనా టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ కూడా సస్పెన్స్ తో అదిరిపోయింది. ఇప్పటిక వరకు కామెడి యాంగిల్ చూపించిన శోభన్ ఈ మూవీలో సీరియస్ మూడ్‌లో యాక్షన్ సీన్స్‌లో భాగా నటించాడు. అల్‌రెడి సంగీత్ శోభన్‌కు యూత్‌లు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ ‘గ్యాంబ్లర్స్’ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.