Site icon NTV Telugu

Samantha : శరీరంపై ఆ టాటూ తొలగించిన సమంత

Samantha

Samantha

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది.

Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో?

అసలు విషయం ఏమిటంటే, గతంలో ఆమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో నాగచైతన్యతో కలిసి నటించిన యే మాయ చేసావే సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఆమె మెడ భాగంలో టాటూగా వేయించుకుంది. తాజాగా “నథింగ్ టు హైడ్” అంటూ క్యాప్షన్ పెట్టి ఆమె వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె మెడ మీద ఎలాంటి టాటూ కనిపించలేదు. మేకప్‌తో దాన్ని కవర్ చేసిందో లేక పూర్తిగా తొలగించిందో అనే క్లారిటీ లేదు, కానీ ఆ టాటూ కనిపించడం లేదు.

Also Read:Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!

నాగచైతన్యతో సంబంధం ఉన్న మరో టాటూను ఆమె ఇప్పటికే తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రాజ్ డీకే దర్శక ద్వయంలో రాజ్‌తో ప్రేమాయణం నడుపుతోందనే ప్రచారం జరుగుతోంది. రాజ్‌కు ఇంకా విడాకులు రానందున, వారు వేచి చూస్తున్నారని, విడాకులు వచ్చిన తర్వాత అధికారికంగా రిలేషన్‌ను అనౌన్స్ చేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version