ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ?
తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ షో కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తెలియడంతో ఈ సిరిస్ షూట్ మళ్లీ మొదలవుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. నేషనల్ మీడియా అయితే ఈ సిరీస్ ఆగిపోయింది అని కూడా వార్తలు రాయడం మొదలు పెట్టింది.
Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ?
అయితే నిజంగా ఆగిపోయిందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఆ సిరీస్ షూట్ నిలిచిపోయింది. రెండు వారాల క్రితమే నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజ్ – డీకే అలాగే కొత్త ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తో మీటింగ్ పెట్టుకుంది. మళ్లీ ప్రాజెక్టు పట్టాలెక్కించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అని లెక్కలు చూస్తే ఆ లెక్కలు వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదని అంటున్నారు. మరి ఫైనల్గా ప్రాజెక్టు మళ్ళీ మొదలవుతుందా లేదా అనేది అనుమానమే.