తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. తన అభినయ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి, పాత్రల ఎంపికలో చాలా జగ్రతలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ యువ నటుడు జునైద్ ఖాన్‌కు అండగా నిలవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
Also Read : Esha Gupta: మా ఇద్దరికి రాసిపెట్టిలేదు.. హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై స్పందించిన ఇషా..
సాయి పల్లవి నటిగా తన విలువల విషయంలో ఎలాంటి రాజీ పడదు. పెద్ద స్టార్ అయిన చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ, తనకు నచ్చిన పాత్ర కాదని ‘భోలా శంకర్’ ను ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఇది ఆమె నటన పట్ల ఉన్న కమిట్మెంట్కు నిదర్శనం. ఇక ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్ అయిన ‘రామాయణం’లో నటిస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటించగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. అయితే..ఈ చిత్రం విడుదలకు ముందే, సాయి పల్లవి మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
‘ఏక్ దిన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండగా, ఇందులో ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు సినిమాల పరాజయాలతో జునైద్ కెరీర్ పై నెగెటివ్ టాక్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో, సాయి పల్లవి లాంటి అగ్ర నటి అతనితో కలిసి పనిచేయడం టాక్ ఆఫ్ దీ ఇండస్ట్రీగా మారింది. దీంతో ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉండటం వలన, ఆమె వ్యక్తిత్వం మరింత వెలుగులోకి వచ్చింది.