ఇండస్ట్రీ ఏదైనప్పటికి బ్రేకప్, విడాకులు కామన్. బంధాలకు విలువ ఇవ్వడం మానేశారు. డబ్బుతో ముడిపెట్టి జీవితాలను కొనడం లేదా అమ్ముకోవడం చేస్తున్నారు. ఇలాంటివి బాలీవుడ్‌లో మరి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. కొట్లలో డబ్బులిచ్చి మరీ బంధాలు వదిలించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ హాట్ బ్యూటీ మోడల్ నటాషా స్టాంకోవిక్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారు తన వివాహబంధాన్ని తెంచుకోవడం క్షణంలో జరిగిపోయాయి. అయితే..
Also Read : Show Time Trailer : నవీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైలర్ రిలీజ్..
గత రోజులుగా హార్దిక్ పాండ్యతో బాలీవుడ్ గ్లామర్ డాల్ ఇషా గుప్తా డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియా కొడైకూస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించింది నటి ఇషా గుప్తా.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా స్పందిస్తూ.. ‘అవును, మేమిద్దరం కొంతకాలం మాట్లాడుకున్నాం. కానీ మేము డేటింగ్ చేశామని నేను అనుకోవడం లేదు. కొన్ని నెలల పాటు మా మధ్య సంభాషణలు జరిగాయి. బహుశా ఇది జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు అన్న దశలో ఉండేవాళ్లం. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయింది. కాబట్టి దాన్ని డేటింగ్ అని చెప్పలేం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మనస్పర్థలు కూడా రాలేదు.. అయితే మేము కలవడం అనేది రాసిపెట్టిలేదు. మేమిద్దరం చాలా భిన్నమైన వ్యక్తులం, అందుకే విషయాలు ముందుకు సాగలేదు’ అని ఇషా చెప్పుకోచ్చారు. మొత్తనికి గత కొంతకాలంగా హార్దిక్ – ఇషా మధ్య ఉన్న రిలేషన్‌పై సాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించినట్టే.