యువ నటుడు రోషన్ కనకాల తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ పేరు ‘మోగ్లీ 2025’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఒక విభిన్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. గ్లింప్స్‌లో రోషన్ లుక్, యాక్షన్ షాట్స్, రొమాంటిక్ షేడ్స్ అన్నీ కలిపి ఒక కొత్త అనుభూతిని కలిగించాయి.
Also Read : OG : పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో హాట్ బ్యూటి కన్ఫర్మా..!
క్లాసిక్ మోగ్లీ కంటే భిన్నంగా, ఈ ఆధునిక మోగ్లీ మరింత క్రూరంగా, తీవ్రంగా, భావోద్వేగ భరితంగా కనిపించనున్నాడు. ప్రకృతితో సఖ్యతగా జీవించే అతని ప్రయాణం ఒక నిశ్శబ్ద ప్రేమకథ నుంచి యుద్ధ గాధ గా మారుతుంది. మునుపటి కంటే ఈ పాత్ర కోసం రోషన్ తన లుక్స్, యాక్షన్, గుర్రపు స్వారీ నైపుణ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. గ్లింప్స్‌లో అతని రా ఇంటెన్సిటీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ సాక్షి సాగర్ మడోల్కర్ గ్లామరస్‌గా కనిపిస్తూ, రోషన్‌తో సహజమైన కెమిస్ట్రీని పంచుకుంది. వారి రొమాంటిక్ సన్నివేశాలు గాఢమైన భావోద్వేగ బంధాన్ని ప్రతిబింబించాయి. విలన్‌గా బండి సరోజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉండి, కథలో ఉత్కంఠను పెంచింది. ముఖ్యంగా నాని వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ అటవీ అందాలను మాయాజాలంలా చిత్రీకరించింది. కాల భైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ కూడా మరింత ఆకట్టుకుంది. మొత్తానికి విభిన్నమైన కాన్సెప్ట్, ఆసక్తికరమైన ప్రెజెంటేషన్‌తో ‘మోగ్లీ 2025’ గ్లింప్స్ ఇప్పటికే చర్చనీయాంశమైంది.