ఆంధ్రప్రదేశ్‌లో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ సినిమా టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 వరకు పెంపు ఉంటుంది. ఈ ధరల పెంపు వారం రోజుల పాటు అమలులో ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభ రోజుల్లో గరిష్ట వసూళ్లను ఆర్జించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘రాబిన్‌హుడ్’ సినిమాలో డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Ashutosh Sharma: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నా గురువుకు అంకితం..
ఈ ధరల పెంపు వార్తల నేపథ్యంలో రాబిన్‌హుడ్ టీం ఒక ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరలను పెంచుతున్నట్లు కొన్ని వార్తలు మా దృష్టికి వచ్చాయి కానీ అవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. ఈ సినిమాతో మా ఉద్దేశ్యం సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడమే. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం ప్రదేశాలలో మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, మొత్తం తెలంగాణాలోని అన్ని సెంటర్స్ లో సాధారణ ధరలు ఉంటాయి. మీ సమీప థియేటర్లలో రాబిన్‌హుడ్‌ను ఆస్వాదించండి, పూర్తి వినోదాన్ని పొందండి అని అంటూ టీం ప్రకటించింది.