టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల చేస్తామని ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో వెల్లడించారు మేకర్స్.
Also Read : Dhruva Sarja : మార్టిన్ ప్లాప్ తో రూట్ మార్చిన ధ్రువ సర్జా
ఇప్పడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వినిపించింది. పుష్ప ఓ వైపు సూపర్ స్ట్రాంగ్ గా నడుస్తుండడంతో రాబిన్ హుడ్ ను వెనక్కి జరిపినట్టు టాక్ వినిపించింది. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారకంగా వెల్లడిస్తూ ‘ అనికొని కారణాల వలన రాబిన్ హుడ్ ను క్రిస్మస్ రిలీజ్ వాయిదా వేయడమైనది. త్వరలోనే మరో డేట్ ను ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. కానీ రాబిన్ హుడ్ ను ఎలాగైనా క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనీ అవసరం అయితే నైజాం రైట్స్ తామే కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని హీరో నితిన్ చాలా ప్రయత్నించారట. కానీ అందుకు నిర్మాతలు అంత సుముఖంగా లేరట. మరోవైపు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు డేట్ పరిశీలిస్తున్నారట మేకర్స్. కానీ అక్కడా ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.