Kantara: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతారా’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సంచలనంగా మారింది. ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిందీలో సైతం ఈ సినిమా దుమ్ము రేపుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో అనుసరించే ప్రాచీన భూత కోల అనే ప్రాచీన ఆచారాన్ని ఇందులో చూపించారు. దైవ నర్తకులు ఈ భూత కోలను ప్రదర్శిస్తూ ‘ఓ’ అని అరుస్తారు. కాంతార చిత్రంలో ఈ అరుపులను స్పెషల్ ఎఫెక్ట్స్ తో రికార్డు చేశారు. వీటిని థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు బయటికి వచ్చిన తర్వాత కూడా ‘ఓ’ అని అరుస్తూ తమ క్రేజ్ ను వెల్లడిస్తున్నారు.
Read Also: Prabhas, Maruthi Movie : ట్రెండ్ మార్చిన ప్రభాస్.. కామెడీ చేస్తున్న రెబల్ స్టార్
దీనిపై కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించారు. కాంతార చిత్రంలో ‘ఓ’ అనే అరుపు ఒక ఆచార, సంప్రదాయానికి సంబంధించినదని, దాన్ని ఎవరూ బయట అరవొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రాచీన సంస్కృతికి చెందిన సున్నితమైన అంశం కావడంతో ఆచారం దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. ‘ఓ’ అనే అరుపును తాము శబ్దంగానే కాకుండా, ఓ సెంటిమెంట్ గా భావిస్తామని స్పష్టం చేశారు.
Read Also:Pragathi: నేను అందగత్తెను.. రజినీ, కమల్ తోనే నటిస్తాను.. వీడితో చేయను
‘కాంతారా’ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఆమె స్పందిస్తూ.. తన కుటుంబసభ్యులతో కలిసి ఇప్పుడే సినిమా చూశానని… ఇప్పటికీ తన శరీరం వణుకుతోందని అన్నారు. ‘రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అంతా అద్భుతం. నమ్మలేకపోతున్నా. అందమైన ఫొటోగ్రఫీ, యాక్షన్, థ్రిల్లర్. సినిమా అంటే ఇలా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే ఇలా ఉండాలి. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదంటూ కొందరు ప్రేక్షకులు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ అనుకుంటుండటం నేను విన్నాను. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా’ అని కంగన తన ఇన్స్టా స్టోరీస్ లో పేర్కొంది.