Prabhas, Maruthi Movie : ట్రెండ్ మార్చిన ప్రభాస్.. కామెడీ చేస్తున్న రెబల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. దర్శకుడు మారుతితో ఆయన ఓ హార్రర్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రభాస్ ఒక క్విక్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నారు. ప్రభాస్ రేపు పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా మారుతి, ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మన డార్లింగ్.. ఆ సినిమాపై మిక్స్‌డ్ టాక్ రావడంతో తన ఆశలంతా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా.. సర్వత్ర మిశ్రమ స్పందనల వ్యక్తమయ్యాయి. దీంతో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
Read Also: Yama Kinkarudu: చిరంజీవిని మాస్ కు చేరువ చేసిన ‘యమకింకరుడు’
ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రభాష్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి చిన్నపాటి షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ నెలకు ఏడు రోజుల కాల్షీట్లు కేటాయించనున్నారట. అలా సినిమా అయ్యే వరకు నెలకు ఏడు రోజులు మాత్రమే డార్లింగ్.. మారుతీ చిత్రంలో పాల్గొనబోతున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.
మారుతీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ నటించిన సలార్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతుంది. మారుతీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తనకు అవసరమైన సహాయ, సాకారాలను అందించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ప్రభాస్ కు తాతగా కనిపించనున్నారని ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: దేవుడా.. టాలీవుడ్ లో ఇంతమంది తెలుగుమ్మాయిలు ఉన్నారా..?
ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసింది. వీరు ఎవరన్నది త్వరలోనే స్పష్టత రానుంది.
- Tags
- actor
- boman irani
- Maruthi
- movie
- prabhas
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?