సూర్య.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో కోలీవుడ్ టూ టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య.. తాజాగా ‘రెట్రో’ సినిమాతో మే 1న అభిమానులను పలకరించాడు. 1990ల బ్యాక్‍డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాని.. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‍లో కనిపించగా, ఈ మూవీలో జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణణ్ సంగీతం అందించారు.
Also Read: Mahesh Babu : మహేష్-రాజమౌళి సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
అయితే ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేయగా, నాని ‘హిట్’ మూవీ కారణంగా ఇక్కడ అంతగా వసూలు రాబట్టలేకపోయింది. కానీ తమిళం లో మాత్రం ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. రూ.70 కోట్లలోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. రెట్రో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకోగా.. ఈ నెల 31న స్రీమింగ్ చేయనుంది. ఈ విషయాని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.