అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకు శివ కృష్ణ సంగీతం, మ్యాస్ట్రో పీవీఆర్ రాజా నేపథ్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు.
ఈ సినిమా స్పెషల్ షోను ఇటీవల ప్రదర్శరించారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం..
రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్‌లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.