నటి రేణు దేశాయ్ కోవిడ్ బాధితులకు అండగా ఉంటానని.. వారికి తన వంతు సాయంగా బెడ్స్‌ను, ఆక్సిజన్‌ను, మెడిసిన్స్‌ను అందిస్తానని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఆమెకు ‘హాయ్.. హలో..’ అంటూ మెసేజులు పెడుతున్నారు. కాగా రేణు మరోసారి సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి విజ్ఞప్తి చేసింది. ‘మీ అనవసర మెసేజ్స్ వల్ల అవసరమైన కోవిడ్ బాధితులకు సాయం అందకుండా పోతుంది. దయచేసి మీరు అలాంటి మెసేజ్స్ చేయకండి అంటూ పిలుపునిచ్చింది. ఈ మెసేజులు వల్ల బాధితుల మెసేజులు వెనక్కి వెళ్తున్నారు, దీంతో నేను వాటిని చూడలేకపోతున్నాను. అర్థం చేసుకుంటారనే మరోసారి చెప్తున్నాను’ అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేసింది.