రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కల్కి పాత్రలో రెబల్ స్టార్ ని చూసిన ప్రేక్షకులు థియేటర్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జూన్ 27 విడుదలాన కల్కి ఇప్పటికి విజయవంతంగా ధియేటర్లలో రన్ అవుతుంది. అటు ఓవర్సీస్ లో రికార్డులును తిరగరాసింది కల్కి.
Also Read: Sridevi: సెల్యులాయిడ్ పై చెక్కుచెదరని ‘అతిలోక సుందరి శ్రీదేవి’ అభినయం..
ఇంతటి సంచనలనాలు నయోదు చేసిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు కల్కి ఫ్యాన్స్. ఫైనల్ గా కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 23న కల్కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్టీమింగ్ చేయనుంది. ఇటీవల విడుదలైన సినిమాలు ఒకటి లైదా రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కల్కి విజయాన్ని ముందే ఊహించిన నిర్మాత అశ్వనీదత్ థియేటర్లలో ఈసినిమా లాంగ్ రన్ ఉండేలా డిజిటల్ రైట్స్ సేల్ చేసేటప్పుడు 8వారాల తర్వత మాత్రమే ఓటీటీలో అందుబాటులోకి తీసుకు రావాలని కండిషన్ పెట్టడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం 50 రోజులకు అతీ సమీపంలో ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గత సినిమాల రికార్డులను బద్దలు కొట్టి తన పేరిట సరికొత్త రికార్డులు లిఖించాడు కల్కి.