టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు అంటేనే ఆయన అభిమానులకు ఓ వైబ్రేషన్. ఎన్టీయార్ ఈ సెప్టెంబరు 2న ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళాడు. కర్ణాటకలోని తారక్ అమ్మ షాలిని సొంత ఊరు కుందపురాలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. తారక్ తో పాటు హోంబాలే ఫిలింస్ నిర్మాత కిరంగదూర్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, అయన సతీమణి, సంగీత దర్శకుడు రవి బస్రూర్ కుడా ఉన్నారు.
Also Read : Bangalore rave party : సాంప్రదాయిని, సుప్పిని, సుద్ద పూసని : హేమ
ఈ ననేపథ్యంలో యంగ్ టైగర్ రవి బస్రూర్ స్టూడియోకు వెళ్ళాడు. తన అభిమాన నటుడు తన స్టూడియోలో మొదటి సారి అడుగు పెట్టినందుకు ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్ కంపోజ్ చేసి తారక్ కు కానుకగా ఇచ్చారు.‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ తారక్ పై ఓ పాటతో అభిమానాన్ని చాటుకున్నారు రవి బస్రూర్. ప్రస్తుతం ఈ సాంగ్ ను తారక్ ఫ్యాన్స్తెగ షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం తారక్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దేవర రిలీజ్ తర్వాత ఎన్టీఆర్-నీల్ సినిమా పట్టాలెక్కునుంది. తారక్ తో సినిమా పూర్తి చేసుకున్న తరువాతే ప్రశాంత్ నీల్ సలార్ 2 పై దృష్టి పెట్టనున్నాడు
"వీడి కంట పడితే నీడకైనా చెమటలే.."#RaviBasrur's musical tribute to #JrNTR after his visit to Ravi Basrur Studios.#NTRNeel pic.twitter.com/Bebl8izoiM
— Gulte (@GulteOfficial) September 11, 2024