రెండు నెలల కిందట బెంగుళూరు రేవ్ పార్టీలో పోలిసులు చేసిన రైడ్ టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి హేమాతో పాటు మరొక యాక్టర్ ఈ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. కానీ ఇక్కడే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది హేమా ఆంటీ. తానూ ఆ రేవ్ పార్టీలో లేనని, భాగ్యనగరంలో తన సొంత ఫామ్ హౌస్ లో ఉన్నానని పోలీసుల కళ్లుగప్పి ఓ వీడియో రిలీజ్ చేసింది హేమా.
Also Read : Hema : బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ తప్పదా..?
డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ లో హేమా సభ్యత్వాన్ని రద్దు చేసారు. అయితే ఇటీవల మరో వీడియో రిలీజ్ చేసింది హేమా. ఆ వీడియోలో ‘నేను డ్రగ్స్ తీసుకోలేదు, పోలీసులు నా శాంపిల్స్ కూడా తీసుకోలేదు, నేను కూడా కొన్ని టెస్ట్ లు చేపించుకున్నాను, అన్నిటీలో నెగిటివ్ వచ్చింది. నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వాలని, నేను నిర్దోషని’ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది నటి హేమా .
తాజగా బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసి అందులో హేమా ఆంటీ పేరును చేర్చారు పోలీసులు. హేమా రేవ్ పార్టీలో పాల్గొని MDMA డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు పోలీసులు, అందుకు సంబంధించి ఆధారాలను, మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్‌కు జోడించారు . దీంతో ఇన్నాళ్లు ‘సంప్రదాయాని, సుప్పిని, సుద్దపూసని’ అని ప్రగల్బాలు పలికిన నటి హేమా ఇలా దొరికిపోయిందని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.