రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప -2 సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. అయితే రష్మిక పెళ్లి, ప్రేమ వ్యవహారం గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని కూడా వినిపించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, వారితో కలిసి పండుగలు సెలెబ్రేట్ చేస్తుంది రష్మిక.
అయితే వీరి ప్రేమ విషయాన్ని ప్రముఖ నిర్మాత నాగ వంశీ స్వయంగా కన్ఫార్మ్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నందమూరి బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత నాగవంశీ. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ -4 కు డాకు మహారాజ్ టీమ్ డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లతో కలిసి నాగవంశీ ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమోరిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈఎపిసోడ్ లో రష్మిక, మీనాక్షి గురించి టాపిక్ రాగా ఏంటి రష్మికాకు పెళ్లి సెటిల్ అయిందా అని నాగవంశీని ప్రశ్నించారు బాలయ్య. అందుకు బదులుగా నాగవంశీ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ హీరోను పెళ్లి చేసుకుంటుందని తెలుసు. కానీ ఎవరు ఏంటని ఇంకా బయటకు చెప్పట్లేదు సార్ అని అన్నారు. ‘తెలిస్తే చెప్పమ్మా కొంచెం వెబ్‌సైట్స్‌కి ఇద్దాం అని బాలయ్య తనదైన శైలిలో లాస్ట్ పంచ్ వేశారు బాలయ్య.