నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసాడు. అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత.
Also Read : Siddharth : సిద్దార్ద్ ‘3BHK’ సేల్ అవుతుందా?
పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమాకు మైసా అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. కాగా తెలుగుకు సంబంధించి సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసారు మేకర్స్. తమిళ పోస్టర్ ను స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చేయగా హిందీ పోస్టర్ ను చావా హీరో విక్కీ కౌశల్ రిలీజ్ చేసారు. మలయాళం పోస్టర్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయగా కన్నడ ఫస్ట్ లుక్ ను శివరాజ్ కుమార్ రిలీజ్ చేస్తూ మైసా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాంప్రదాయ చీరలో ముక్కుపుడక మరియు ఆభరణాలతో అలంకరించబడిన రష్మిక ఒక గోండ్ మహిళ వీరత్వాన్ని తెలియజేసేలా ఉంది. రక్తంతో తడిసిన రూపం మరియు ఆమె చేతిలోపట్టుకున్న ఆయుధం ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఇంప్రెషన్ కలిగిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెలుతున్న రష్మిక మైసా తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకునేలా ఉంది.