ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంది రష్మిక మందన్నా . కన్నడ సినిమాతో జర్నీ మొదలు పెట్టి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ మొదటగా పుష్పరాజ్‌కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘ఛావా’, ‘యానిమల్’ మూవీస్‌తో బాలీవుడ్‌లో సైతం ఈ అందాలభామ వైభవం ఓ రేంజ్‌లో వెలిగిపోతున్నది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, ప్రస్తుతం తెలుగు ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో పాటు బాలీవుడ్ హారర్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ‘థమా’ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరుగానే ఉంటూ ఉంటుంది రష్మిక. తనకు టైం దోరికినప్పుడల ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తు, వారు అడిగిన ప్రశ్నలకు చిలిపి సమాధానాలు ఇస్తూ ఉంటుంది.
Also Read : Ravi Teja : అది దా సర్ప్రైజ్..మాస్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ !
ఇందులో భాగంగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో వర్షాలపై ఆసక్తికరంగా ఓ పోస్ట్ పెట్టింది తను. ‘వర్షాకాలం వచ్చేసింది. నిజానికి నాకు వర్షాకాలం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్షాల వల్ల పనులు ముందుకు సాగవు. వర్క్ స్పీడ్‌గా జరగదు. కానీ.. వర్షం పడటానికి ముందు వచ్చే మట్టి వాసన అంటే మాత్రం నాకెంతో ఇష్టం. ఆ స్మెల్ వస్తే.. గుండెల నిండా పీల్చేసుకుంటా’ అంటూ పోస్ట్ చేసింది రష్మిక.