తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాశీ ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ఆడియన్స్‌ను అలరించడంలో సక్సెస్ సాధించింది. తన అందం నటనతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 2013 నుంచి ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎంతో మంది స్టార్స్ తో నటించిన సాలిడ్ హిట్ దక్కించుకోలేకపోయింది. ప్రజంట్ ఎక్కువగా తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద వైరల్ కామెంట్స్ చేసింది..
Also Read: Vishvambhara : ‘విశ్వంభర’ షూటింగ్ అప్ డేట్..
‘ఈ మధ్యకాలంలో దక్షిణాదిలో సినిమాలు డబ్బింగ్ చిత్రాలుగా అన్ని భాషల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. దీని వల్ల ఆ సినిమాల్ని రీమేక్ చేసిన బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద అంతగా ఆడటంలేదు. ఇది అందరూ అంగీకరించాల్సి విషయం. ఈ కోవలో ప్రయాణిస్తున్న హిందీ పరిశ్రమ సినిమాలు తీసే పద్ధతి మార్చుకోవాలి. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథల్ని ఇష్టపడుతూ వాటికే మొగ్గు చూపుతున్నారు. ఓటీటీలు కూడా వైవిధ్యమైన కథలతో సినీ ప్రియులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం కొత్తదనం నిండిన కంటెంట్‌తో అభిమానుల్ని కట్టిపడేసే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ నా సినీ ప్రయాణం సాగుతుంది. మంచి సినిమాల్లో భాగం కావడానికి ఇండస్ట్రీ, భాష తో సంబంధం లేదు.ఎందుకంటే భావోద్వేగాలు అనేవి అన్ని భాషల్లో ఒకే విధంగా ఉంటాయి. కానీ సంస్కృతి, సాంప్రదాయల విలువల్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది అంతే..’ అని తెలిపింది రాశీ ఖన్నా.