Upasana Kamineni Konidela: వెల్‌నెస్ ‘షార్క్’ – ఎంపరింగ్ విమెన్ ఎంటర్‌ప్రిన్యూవర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upasana Konidela Launches ‘Shark Tank’ Platform for Women: ఉపాసన కొనిదెల, వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఓ శక్తిగా ఉన్న ఆమె తొలిసారిగా మహిళలకు వ్యాపార రంగంలో సుస్థిరమైన వ్యవస్థను సృష్టించటం కోసం తనతో చేరమని పిలుపునిస్తున్నారు. మహిళలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యాపార వేదికను ప్రారంభిస్తున్నారు. ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఉపాసన, మహిళల విజయానికి అవసరమైన మార్గదర్శకత్వం, వనరులు, అవకాశాలను అందించేందుకు తాను ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నట్టుగా చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని, పాత పద్దతులను పక్కన పెట్టి వ్యాపార రంగంలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
మహిళల్లో ఉన్న సృజనాత్మకత, నాయకత్వం, సామాజిక పరిస్థితులను మార్చే శక్తికి ఓ వేదికను నిర్మించాలి. ‘నేను ప్రతి మహిళా వ్యాపారవేత్తను వెల్‌నెస్ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ఓ శక్తివంతమైన వేదికను నిర్మిద్దాం. అందరి సహకారంతో ఎంతటి పోటిలో అయినా గెలుపు సాధించవచ్చు. మన సమిష్టి శక్తితో వెల్‌నెస్ రంగంలోకి రాబోయే కొత్త తరానికి మార్గం వేద్దాం. కలిసి ఎదుగుదాం’ అంటూ పిలుపునిచ్చారు ఉపాసన. ఈ కార్యక్రమంలో భాగం కావాలనుకుంటున్న వారు, తమ వ్యాపారం సమాజంపై కలిగించే ప్రభావం, ప్రపంచానికి జరిగే మంచి అలాగే ఉపాసనను సహ వ్యవస్థాపకురాలిగా ఎందుకు కోరుకుంటున్నారనే విషయాలను వివరిస్తూ ఓ మెయిల్‌ను cofounder@urlife.co.inకు పంపాలని కోరారు. వెల్‌నెస్ భవిష్యత్తును తిరిగి పునర్నిర్మించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఉపాసనతో చేరండి.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?