Ramya Livein Relation With Karthik Gowda Become hot topic: శాండల్‌వుడ్ క్వీన్ రమ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ వార్తలతో సందడి చేస్తూనే ఉంటుంది. అయితే, గత కొన్ని నెలలుగా నటి రమ్య సినీ పరిశ్రమకు చెందిన వారితో కలసిమెలసి ఉంటోంది. సినిమా సెట్స్‌కి వెళ్లడం దగ్గర నుంచి తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల టీజర్‌లు, ట్రైలర్‌లను రిలీజ్ చేయడం దాకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది. అయితే ప్రముఖ నిర్మాతతో ఆమె సహజీవనం చేస్తున్నదనే వార్తలకు బలం చేకూరేలా వారిద్దరూ కలిసి కనిపించడం కన్నడ మీడియాను ఆకర్షించింది. ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడ కేసు తర్వాత ఇప్పుడు కార్తీక్ గౌడ, రమ్య అఫైర్ గురించి చర్చించుకుంటున్నారు. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని గత కొద్దికాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని కొద్దికాలంగా మీడియాలో వినిపిస్తూ వస్తుంది.
డైరెక్టర్ కేఎస్ రవికుమార్కి హీరోయిన్ కన్నా అందమైన కూతురు.. ఎప్పుడైనా చూశారా?
కార్తీక్ గౌడ, రమ్య ఇద్దరు కలిసి మెలిసి కనిపించడం, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందనే విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ విషయంపై ఎన్ని చర్చలు జరుగుతున్నా వారిద్దరూ పెదవి విప్పితే తప్ప అసలు విషయం ఏమిటనేది తెలియదు. కార్తీక్ గౌడ కన్నడ సినిమా పరిశ్రమలో బడా నిర్మాత, కేఆర్‌జీ స్టూడియోస్ అధినేతగా 2017లో స్టూడియో నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 100 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి రత్నన్ ప్రపంచ అనే మూవీతో కన్నడ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు. రమ్య అసలు పేరు దివ్య స్పందన. కన్నడలో స్టార్ హీరోయిన్‌గా పేఉన్న ఆమె మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యి అప్పటి నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్టు ఉంటూ మళ్ళీ సినిమాల మీద సినిమాలపై ఫోకస్ పెట్టారు.