సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానున్న ఈ చిత్రంలో రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది.
Also Read : Jr. NTR : వార్ -2 లో అడుగుపెట్టనున్న దేవర
అక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ‘వేట్టయాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్, ఇటు తమిళనాడు లో భారీ స్థాయిలో జరుగుతున్నయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘వేట్టయాన్’ ఆశించినంతగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగట్లేదు. రిలీజ్ కు ఒక్కరోజు మాత్రమే ఉన్న కూడా కోటి రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టలేకపోయింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు ఎలా ఉందొ. ఇందుకుగల కారణాలు ఏంటని విశ్లేషించగా మొదటి కారణం టైటిల్. ‘వేట్టయాన్’ ది హంటర్ తమిళ టైటిల్ ను యధావిధిగా అలాగే తెలుగులో పెట్టడం. తెలుగు ప్రేక్షకులు అంటే అంత చులకన అయ్యారు అనే భావన కొందరిలో ఏర్పడింది. ఇక మరొక కారణం దేవర. ఇప్పటికి దేవర అన్ని కేంద్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండంతో ఆంధ్రలోని కింద సెంటర్స్ లో ‘వేట్టయాన్’కు థియేటర్స్ ఇవ్వలేదు. సినిమా బాగుంటే చూడోచ్చులే అనే భావనలో మెజారిటీ ఆడియెన్స్ ఉన్నారు, అది కుడా ఓక కారణం కావొచ్చు.