యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. ఒక రొటీన్ రెగ్యులర్ సినిమాకి కూడా సూపర్ కలెక్షన్స్ రాబట్టడం అంటే అది ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది. తాజాగా రిలీజైన దేవర మరోసారి నిరూపించింది. రిలీజ్ నాడు దేవర కు సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ట్రెండ్ వేరే ఏ సినిమాకైనా జరిగి ఉంటె మాట్ని షో నుండే ఖాళీ అయిపోయేవి. అంతటి నెగటివ్ దేవర విషయంలో జరిగింది. కానీ కలెక్షన్స్ మాత్రం అందుకు బిన్నంగా ఉన్నాయి.
ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ సినిమాగా మరోటి బాలీవుడ్ సినిమా వార్ – 2. ప్రస్తుతం వార్ -2 షూట్ శరవేగంగా జరుగుతుంది. తారక్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. దేవర జోష్ లో ఉన్న తారక్ అదే జోష్ లో వార్ – 2 షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఈ అక్టోబరు రెండవ వారంలో ఈ భారీ బడ్జెట్ సినిమాలో తారక్ జాయిన్ అవుతాడని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని యూనిట్ వర్గాల సమాచారం. అలాగే ఈ చిత్రంలో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ కాంబోలో ఓ గ్రాండ్ సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ లోని డాన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అసలే డాన్స్ లాతొ అదరగొట్టే ఈ హీరోలు ఒకేఫ్రేమ్ లో నాట్యం ఆడితే ఫాన్స్ కు అదొక విజువల్ ట్రేట్ లా ఉండబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు