రాజమౌళి స్ట్రాటజీ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు ఏమాత్రం అంతు పట్టడం లేదు. సాధారణంగా రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే, ఆయన ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా డీటెయిల్స్ వెల్లడించేవాడు. ఒకానొక సందర్భంలో ప్లాట్ లైన్ ఏంటో కూడా చెప్పేసి, ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టేవాడు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు అభిమానులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే, రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు పెట్టాడు, తర్వాత ఒడిశాకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. అక్కడ లీకైన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చినా సరే, సినిమా గురించి ఏమాత్రం రాజమౌళి నోరు తెరవలేదు.
Read More:Trivikram Srinivas : సిరివెన్నెల రాసిన ఆ పాటనే అన్నింటికంటే గొప్పది : త్రివిక్రమ్
ఇతర ఫంక్షన్స్‌లో రాజమౌళిని ఈ సినిమా గురించి అడిగినా, ఆయన మౌనమే సమాధానంగా నవ్వుతూ పక్కకు తప్పుకుంటున్నాడు. అయితే, ఈ సినిమా విషయంలో ఎందుకు ఇంత సీక్రెసీ మైంటైన్ చేస్తున్నాడు అనే విషయం మహేష్ బాబు అభిమానులకు అంతు చిక్కడం లేదు. ఈ సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ముందు నుంచి రాజమౌళి మెయింటైన్ చేస్తున్న సైలెన్స్ మహేష్ అభిమానుల్లో మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు ప్రియాంకా చోప్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి సమ్మర్ వెకేషన్ అంటూ రాజమౌళి షూట్‌కి గ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.