డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి చేస్తున్న సినిమా SSMB29. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో విదేశాల్లో కొంత భాగం జరగనున్న నేపథ్యంలో రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Imanvi : నాకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ!
SSMB29 సినిమా ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో ఆఫ్రికన్ అడవుల నేపథ్యం ఉంటుందని, హాలీవుడ్ నటులు కూడా నటించే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ (రాజమౌళి తండ్రి మరియు కథా రచయిత) గతంలో వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ హైదరాబాదు, కోరాపుట్ లో రెండు షెడ్యూల్స్ జరిగింది. మహేష్ బాబు ఈ సినిమా కోసం కొత్త లుక్‌లో కనిపించనున్నారు, గడ్డం మరియు పొడవాటి జుట్టుతో కనిపించాడు. ఆ మధ్య సినిమా నుంచి లీకైన కంటెంట్ కూడా ఆ విషయాన్ని ఖరారు చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతోంది, మరియు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలవనుందని అంచనా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.