Imanvi : నాకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్‌లోని పహల్గాం అనే హిల్ స్టేషన్‌లో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ ఘటన మీద ఆగ్రహవేషాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, పాకిస్తాన్ నటీనటులను మన సినిమాల్లో నటింపజేయకూడదంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి. ఆమె తండ్రి గతంలో పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశారని, ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ఆమె ప్రభాస్ హీరోయిన్‌గా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఘటన మీద ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
Rajeev Shukla: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐసీసీ కోసమే ఇన్నాళ్లు ఆడాం!
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
జరిగిన దారుణం గురించి స్పందిస్తూ, అందులో బాధితులైన వారందరికీ ఆమె సంతాపం వ్యక్తం చేసింది. ఇలాంటి వైలెన్స్ ను తాను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అలాగే, తన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ, “మా కుటుంబం నుంచి ఎవరికీ పాకిస్తాన్ మిలిటరీతో సంబంధం లేదు. ఈ విషయం ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు, కానీ ఈ విషయం సహా ఎన్నో విషయాలు నా గురించి తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఇంకా బాధించే విషయం ఏమిటంటే, బాధ్యత కలిగిన జర్నలిస్టులు, మీడియా అవుట్‌లెట్‌లు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు కానీ నిజానిజాలు ఖరారు చేసుకుని స్పందించడం లేదు. నేను ఒక ప్రౌడ్ ఇండియన్-అమెరికన్. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడతాను. మా తల్లిదండ్రులు యూత్‌లో ఉన్నప్పుడే అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యారు. వారు అమెరికా పౌరులయ్యారు. అమెరికాలో నా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డాన్సర్‌గా మారాలని అనుకున్నాను. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఖచ్చితంగా నేను భారత మూలాలు ఉన్న వ్యక్తిని. దయచేసి ఈ విషయంలో నన్ను బ్యాడ్ చేయకండి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!