సివరపల్లి విజయం తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ, వాటిలో పూర్తిగా ఒదిగిపోతూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రాగ్ మయూర్. ఇటీవల సమంత నిర్మాణంలో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విడుదలైన ‘శుభం’ చిత్రంలో రాగ్ మయూర్ పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “‘సినిమా బండి’ విజయం తర్వాత ‘శుభం’లో నా పాత్ర మరిడేష్ బాబు కొనసాగింపులా ఉంటుంది. దర్శకుడు ప్రవీణ్ నా పాత్రను చాలా ఫన్నీగా రూపొందించారు.
Read More:Raj Tarun : రాజ్ తరుణ్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్..!
కథ విన్న తర్వాత ఈ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని భావించాను. అందుకే ఈ చిత్రంలో నటించాను. నా నమ్మకం ఫలించింది, పాత్రకు గొప్ప స్పందన వస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన సమంతగారికి, ప్రవీణ్‌గారికి కృతజ్ఞతలు. సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉంది” అన్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘పరదా’లో రాగ్ మయూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి నటిస్తున్నారు. దీని గురించి ఆయన చెప్పుకొచ్చిన విషయాలు ఇలా ఉన్నాయి: “‘పరదా’లో నేను పూర్తి నిడివి గల పాత్ర పోషించాను. పాత్ర రూపకల్పన, చిత్రీకరణ ఆసక్తికరంగా ఉంటాయి. సోషల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది” అని తెలిపారు.
Read More:Buddha Venkanna: బాహుబలి రెండే పార్టులు.. కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు..!
ప్రస్తుతం GA2 నిర్మాణంలో రూపొందుతున్న ‘బడ్డీ’ కామెడీ చిత్రంలోనూ రాగ్ మయూర్ నటిస్తున్నారు. అలాగే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉన్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. “విభిన్న పాత్రల్లో నటించడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం వల్ల నటుడిగా నా సామర్థ్యం మరింత పెరుగుతోంది. ప్రముఖ బ్యానర్లతో పనిచేయడం వల్ల నిర్మాణ అంశాలపై అవగాహన కలుగుతోంది. అద్భుతమైన టెక్నీషియన్లతో కలిసి పనిచేయడం, వారితో జర్నీ చేయడం నాకు కొత్త కోణాలను ఆవిష్కరించే అవకాశం ఇస్తోంది” అని రాగ్ మయూర్ వెల్లడించారు.