టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాలలో పుష్ప -2 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఊహించిన దాని కంటే విజయం సాధించడం, నేషనల్ వైడ్‌గా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్..తగ్గేదేలే అనే డైలగ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హీరో, దర్శకుడు. ముందుగా అనుకున్న కథ లో చాలా మార్పులు చేర్పులు చేసి పుష్ప -2ను తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్.
Aslo Read: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?
పుష్ప -2 ఫస్ట్ విడుదల చేయగా రికార్డు స్థాయి వ్యూస్ తో టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ చిత్రం నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ విడుదలైన రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. కాగా ఇటీవల పుష్ప సినిమాపై అనేక రూమర్స్ వినిపించాయి. హీరో , దర్శకుడికి మధ్య విభేదాలు వచ్చాయని షూటింగ్ ఆపేశారని, డిసెంబరులో ఈ సినిమా రాదు అంటూ రక రకాల పుకార్లు షికార్లు చేసాయి. అవేవి నిజం కాదని, ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో ఉన్నారని. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయి. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్ బంప్స్ వచ్చే విధంగా ఉండబోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ కోసం వెయిట్ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.