నిజం చెప్పాలంటే.. పుష్ప 2 తెలుగు సినిమాగా రిలీజ్ కాలేదు, ఓ బాలీవుడ్ సినిమాగా భారీ ఎత్తున థియేటర్లోకి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే.. తెలుగులో కంటే.. హిందీలోనే పుష్పరాజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అసలు.. పుష్ప 1 హిట్ అయిందే హిందీలో. అందుకే.. బీహార్ నుంచి పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. లక్షలాది మంది తరలి వచ్చారు. ఆ తర్వాత ముంబైలోను గ్రాండ్ ఈవెంట్ చేశారు. ఫైనల్‌గా.. బాలీవుడ్ స్టార్స్‌కు మించిన క్రేజ్‌తో రిలీజ్ అయిన పుష్ప 2.. బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. నార్త్‌లో తొలిరోజు ప్రేక్షకులు పుష్ప 2 సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా హిందీ వెర్షన్‌కి తొలిరోజు 72 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.
Sukumar: సుక్కు చేతుల మీదుగా హార్లీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!!
ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ 65 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు 72 కోట్లతో పుష్పరాజ్ దుమ్ము దులిపేశాడు. బాలీవుడ్‌లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప 2.. నాన్ హాలిడే, నాన్ ఫెస్టివల్ డే నాడు బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. డబ్బింగ్ సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్ సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసింది. ఓవరాల్‌గా బాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసి.. నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది పుష్ప 2. ఇక్కడితో బన్నీకి నార్త్‌లో సాలిడ్ మార్కెట్ ఏర్పడినట్టే. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవల్‌కి వెళ్లినట్టే. మొత్తంగా.. అల్లు అర్జున్ బాలీవుడ్‌లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు. ఒక్క హిందీలో ఈ సినిమాకు 200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి లాంగ్ రన్‌లో ఎంత రాబడుతుందో చూడాలి.