ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా పుష్ప స్పెషల్ ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ అయింది పుష్ప- 2. మూడేళ్ళుగా సెట్స్ పై ఉన్న పుష్ప మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చింది. అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ గురువారం రాత్రి 9: 30 గంటల ఆటతో రిలీజ్ విడుదల అయింది.
Also Read : Pushpa 2 : జాతర ఎపిసోడ్ కు జాతీయ అవార్డు గ్యారెంటీ
భారీ ఎత్తున రిలీజ్ అయిన ప్రీమియర్స్ కు అద్భుత స్పందన లభించింది. అటు అమెరికా నుండి ఇటు అనకాపల్లి వరకు ఎక్కడ విన్న ఒకటే మాట పుష్ప -2 ఊహించిన దాని కంటే కూడా బాగుంది. బన్నీ ఎంట్రీతో మొదలైన హై చివరలో ఎండ్ కార్డ్ పడేవరకు కూడా తగ్గేదేలే అనేలా సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులని కట్టిపడేసింది. ప్రతి సీన్ లో తన బాడీ లాంగ్వేజ్ తో నటనతో అల్లు అర్జున్ మెస్మరైజ్ చేసేసాడు. మరి ముఖ్యంగా చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ కు థియేటర్స్ లో చప్పట్లతో మోతమోగిపోయాయి. ఇక సాంగ్స్ లో ఆయితే డాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కిస్సిక్ సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల వేసిన స్టెప్పులకు కుర్రకారు హుషారెత్తారు.మొత్తానికి బన్నీ పడిన కష్టానికి ఆయన ఫాన్స్ ఎదురుచూపులకు తగ్గ ఫలితం దక్కిందనే చెప్పవచ్చు. ఇక మొదట రోజు పుష్ప -2 వారల్డ్ వైడ్ గా ఎంత మేరకు రాబడుతుందో చూడాలి.