టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకర్లేదు. దాదాపు ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోల అందరి కెరీర్‌కు మంచి హిట్ ఇచ్చాడు దర్శకుడు పూరి. అలాంటి ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టే పూరి.. ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. టాలీవుడ్ స్టార్లలో ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. నిర్మాత దొరకడం కష్టమైంది. కానీ మొత్తానికి పూరి విజయ్ సేతుపతితో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు.
Also Read : Rashmi : భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
అయితే ఇప్పటికే టబు, రాధికా ఆప్టే లాంటి ఆర్టిస్టులు ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ని కూడా సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్‌కి జోడిగా నటిస్తోంది అని అనుకున్నారు. కానీ హీరోయిన్ నివేదా థామస్ విజయ్ భార్యగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి విద్య పాత్ర ఏంటి? అంటే తాజా సమాచారం ప్రకారం రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. సహజంగా పూరి క్యారెక్టర్స్‌లో డెప్త్ ఉంటుంది. మరి రాజకీయాల పై ఎలాంటి పాత్రలు రాశాడో చూడాలి.