కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి ఉంది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. Read…
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియా వరకు అంతిమయాత్ర కొనసాగగా భారీ సంఖ్యలో అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ అంక్షలు, రహదారిలో అడుగు అడుగునా పోలీసు బందోబస్తుతో ఈ అంతిమయాత్ర జరిగింది. ప్రస్తుతం రాజ్ కుమార్ స్టూడియో కు పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం చేరుకుంది. అభిమానులు కూడా భారీగా స్టూడియో వద్దకు చేరుకుంటున్నారు. స్టూడియో వద్ద భారీగా బలగాలను…
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉంది. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అమెరికా నుంచి కుటుంబ సభ్యుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. నిన్న ఉదయం గుండెపోటుతో ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి, అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంకు తరలించి, అప్పటి నుంచి అభిమానుల సందర్శనార్థం ఇంకా అక్కడే ఉంచారు. ఆయనను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తుండగా, సెలెబ్రిటీలు సైతం పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. Read Also :…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పునీత్ అంత్యక్రియల విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్ రాజ్ కుమార్‌తో పునీత్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పునీత్‌కు ఇద్దరు కూతుళ్లే కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు కుటుంబ సభ్యులు. Read…
పునీత్ రాజ్‌కుమార్ మృతి దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో జరగనున్నాయి. ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకోనున్నారు. ఎన్టీఆర్ పునీత్ రాజ్‌కుమార్‌కు చాలా సన్నిహితుడు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మధ్య గొప్ప అనుబంధం ఉంది. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమా…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 46 ఎల్లా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి కూడా మరొక వ్యక్తి జీవితంలో వెలుగు నింపారు. పునీత్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బ్రతికి ఉన్నప్పుడు పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. హీరో అయితే వెండితెరపై మాత్రమే అంటూ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే వారు పునీత్.…