పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ను జూలై రెండవ వారంలో ప్రారంభించాల్సి ఉంది. కానీ కరోనాతో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆగిపోయిందని నిర్మాతలు చెప్పారు. అయితే సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా నిర్మాతలతో కొన్ని విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మురెల్లా స్థానంలో డిఓపి రవి కె చంద్రన్ వచ్చారు. ఈ కారణంగానే ఈ షెడ్యూల్ వాయిదా పడిండదనే ప్రచారం జరిగింది.
Read Also : మరోసారి చిరంజీవి ద్విపాత్రాభినయం
ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, తర్వాత రానా, పవన్ కళ్యాణ్ మధ్య క్లైమాక్స్ సీన్స్ పూర్తి చేయనున్నారు. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో “అయ్యప్పనమ్ కోషియం” తెలుగు రీమేక్ మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం 2022లో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. పవన్‌కు జంటగా నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.