విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిర్మాత నాగవంశీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రాల ఫ్లాప్‌ల గురించి ఓపెన్ అయ్యారు.
Also Read : HHVM : నిది అగర్వాల్ కష్టం చూసి నాకే సిగ్గేసింది : పవన్ కళ్యాణ్
నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ ‘లక్కీ భాస్కర్’ సినిమాకు నేను ఊహించినంత వసూళ్లు రాలేదు. అలాగే ‘గుంటూరు కారం’పై వచ్చిన ట్రోలింగ్ నాకు ఇంకా అర్థం కావడం లేదు. కానీ నేను తెలిసి చేసిన తప్పు ‘రణరంగం’. శర్వానంద్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సమయంలో వయసున్న పాత్ర చేయించడం అంత మంచిదేం కాదు అని బాబాయ్ గారు హెచ్చరించారు. అయినా మేము కొత్తగా ప్రయత్నించాలనుకున్నాం. అది వర్కౌట్ కాలేదు. కానీ అది పూర్తిగా ఫెయిల్ అయింది. బహుశా ఆ పాత్రను రవితేజ వంటి వాళ్లు చేసిన, హిట్ అయ్యేదేమో. అలాగే ‘ఆదికేశవ’ సినిమా విషయంలో కూడా పెద్ద తప్పు చేశా. రిపేర్ చేయాలని ప్రయత్నించిన కుదర్లేదు. ఈ రెండు సినిమాలు నా కెరీర్‌లో చాలా ఖరీదైన తప్పులుగా మిగిలిపోయాయి’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. తన తప్పులను నిస్సందేహంగా అంగీకరించి, తద్వారా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న నాగవంశీ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు, సినీ వర్గాలు ఆయన నిజాయతీని మెచ్చుకుంటున్నారు.