కొద్ది రోజులు క్రితం హైదరాబాద్ లోని టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారు ఐటీ అధికారులు. పుష్ప చిత్ర నిర్మాతలు, దర్శకులు సుకుమార్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు అధికారులు. అలాగే మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.
Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్.. ‘K’RAMP
దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు చేసి తమ ఎదుట హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు అందజేశారు. అందులో భాగంగా నేడు సదరు ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు నిర్మాత దిల్ రాజు. నాలుగు రోజులపాటు దిల్ రాజు ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు ఆయన వ్యాపారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. దిల్ రాజు అటు సినిమా నిర్మాణంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటిర్ గా వ్యహరిస్తున్నారు. సినిమా విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేసారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ ను అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించారు. వాటన్నటికి ఫైనాన్స్ ఎక్కడ తెచ్చారు, ఎంత తెచ్చారు, అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. దిల్ రాజ్ తో పాటు పలువురు నిర్మాత దర్శకుడు ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ.