కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో ‘దేవి’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్‌గా నటించగా సిజ్జు హీరోగా నటించాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. అయితే తాజాగా నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
Also Read: Rashmika : దెయ్యం సినిమాలో నేషనల్ క్రష్..
‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే చాలా పెద్ద రిస్క్. అయినప్పటికి కోడి రామకృష్ణ ఈ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం కోడి రామకృష్ణ. చెప్పాలంటే ఒకొక్క సీన్‌కు 50 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు మూవీలో ప్రతి ఒకటి పర్‌ఫెక్ట్‌గా రావాలి. అందుకే నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. గెటప్ వేసిన తర్వాత దేవత ఎలా మాట్లాడుతుందో.. ఆమె హావ భావాలు ఎలా ఉంటాయో చెప్తూ దగ్గరుండి చేయించారు. ఆ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మంచులో షూటింగ్ చేశాం. చాలా ఇబ్బందిపడ్డాను.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఆ రేంజ్‌లో హిట్ అవుతుందని ఊహించలేదు. కానీ మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. షూటింగ్‌లో పాము ఒక వ్యక్తిని నిజంగానే కాటువేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన అతన్ని బ్రతికించు కోలేకపోయాం’ అని తెలిపింది ప్రేమ.