పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ గురించి హృదయపూర్వకంగా స్పందించారు. గతంలోనే కేజీఎఫ్, కాంతార వంటి భారీ హిట్‌లతో దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్న బెంగళూరు కేంద్రీకృత సంస్థ హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు టాప్ స్టూడియోలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ సంస్థతో ప్రభాస్‌కు ‘సలార్’ చిత్రంతో బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధం ఇప్పుడు మరింత బలపడుతుంది. హోంబలే తో మరో రెండు భారీ ప్రాజెక్టులు చేయనున్నట్లు గతేడాది ప్రకటన వెలువడింది. అయితే
Also Read : Anupama : ‘పరదా’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ ..
తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ హోంబలే ఫిల్మ్స్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ ‘కేజీఎఫ్’ షూటింగ్ టైమ్‌లో జరిగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. సినిమా కోసం వేసిన భారీ సెట్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అప్పటికే బడ్జెట్ పరంగా పరిమితులు ఏర్పడటంతో యూనిట్ సభ్యులందరూ టెన్షన్ పడ్డారు. కానీ నిర్మాత విజయ్ కిరంగదూర్ మాత్రం ‘మీరందరూ ప్రశాంతంగా ఉండండి. డబ్బు అసలు సమస్యే కాదు. సినిమా నాణ్యత విషయంలో మాత్రం రాజీపడొద్దు’ అంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావొద్దనే ఆయన ధోరణి నాకు బాగా నచ్చింది. అందుకే హోంబలే ఫిల్మ్స్‌తో వరుస ప్రాజెక్ట్‌లు అంగీకరించా’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ప్రజంట్ డార్లింగ్ మాటలు వైరల్ అవుతున్నాయి.